ఏపీలో కొత్త పెన్షన్లు.. రేపటి నుంచే దరఖాస్తులు ప్రారంభం.. కావలసిన సర్టిఫికెట్లు | NTR Bharosa Pensions 2026 Applications Started, Required Document
AP NTR Bharosa Pension 2026 Applications Started Required Document Latest News : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లో రేపు నుంచే కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రారంభం. కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
AP NTR Bharosa Pension 2026 Schedule :
| ప్రక్రియ | తేదీ |
|---|---|
| దరఖాస్తు ప్రారంభం (Swarna Grama/Ward) | Sep 7, 2026 నుంచి |
| దరఖాస్తు చివరి తేదీ | Sep 16, 2026 |
| Document Verification | Sep 17 – Sep 21, 2026 |
| MPDO / Municipal Commissioner / District Scrutiny | Sep 22 – Sep 24, 2026 |
| Pension Approval | Sep 25-26, 2026 |
ఆ తర్వాత దశలవారీగా పెన్షన్లు విడుదల చేస్తారు.

ఎవరు అప్లై చేయవచ్చు & కావలసిన డాక్యుమెంట్స్ :
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేతలు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్ జెండర్లు తదితరులు అప్లై చేసుకోవచ్చు.
కేటగిరీని బట్టి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయంలో దరఖాస్తు ఫారంతో పాటు క్రింది డాక్యుమెంట్స్ జత చేయాలి:
- రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్
- సదరం సర్టిఫికెట్ (దివ్యాంగులకు)
- డివోర్స్ సర్టిఫికెట్, బర్త్ & డెత్ సర్టిఫికెట్ (కేటగిరీ ప్రకారం)
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
Tags: AP NTR Bharosa New Pensions 2026, NTR Bharosa Pension Applications Sep 7 to 16, AP New Pension Documents Required, NTR Bharosa Pension Verification Sep 17 Approval Sep 25
