📢 పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! Telangana Cheyutha Pension 2026 | కొత్త దరఖాస్తులు ప్రారంభం 📢

Telangana Cheyutha Pension 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేయూత కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 33 జిల్లాల్లోని అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గమనిక: అవసరమైన పత్రాలు జత చేయని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
📋 అందుబాటులో ఉన్న పెన్షన్ల వివరాలు
| పెన్షన్ రకం | నెలకు మొత్తం |
| వితంతువుల పెన్షన్ | ₹ 2016/- |
| ఒంటరి మహిళల పెన్షన్ | ₹ 2016/- |
| కల్లు గీత కార్మికులు పెన్షన్ | ₹ 2016/- |
| దివ్యాంగుల పెన్షన్ | ₹ 4016/- |
| చేనేత కార్మికులు పెన్షన్ | ₹ 2016/- |
| పైలేరియా బాధితులు (గ్రేడ్-II & III) పెన్షన్ | ₹ 2016/- |
| డయాలసిస్ రోగుల పెన్షన్ | ₹ 2016/- |
📄 దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
- ✔ పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
- ✔ ఆధార్ కార్డు
- ✔ వయస్సు ధ్రువీకరణ పత్రం
- ✔ రేషన్ కార్డు లేదా రెవెన్యూ శాఖ జారీ చేసిన వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం
- ✔ బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ
- ✔ వితంతువులు: భర్త మరణ ధ్రువీకరణ పత్రం + ఆధార్
- ✔ ఒంటరి మహిళలు: విడాకులు/వేర్పాటు ధ్రువీకరణ పత్రం లేదా తహసీల్దార్ స్థానిక విచారణ నివేదిక
- ✔ చేనేత కార్మికులు: చేనేత & వస్త్ర శాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం
- ✔ కల్లుగీత కార్మికులు: ఎక్సైజ్ శాఖ జారీ చేసిన సహకార సంఘ సభ్యత ధ్రువీకరణ పత్రం
గమనిక: దరఖాస్తులో అడిగిన ప్రతి వివరం పూర్తి చేసి, సంబంధిత రుజువుల కాపీలు తప్పనిసరిగా జత చేయాలి.
📩 దరఖాస్తు విధానం
అర్హులైన అభ్యర్థులు మీ గ్రామపంచాయతీ కార్యదర్శి లేదా MPDO కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫారం మరియు ఇతర వివరాల కోసం క్రింది లింకులు ఉపయోగించండి.
🔗 ముఖ్యమైన లింకులు
| CHEYUTHA Pension దరఖాస్తు ఫామ్ | డౌన్లోడ్ చేయండి |
| పెన్షన్ వివరాలు తనిఖీ చేయడానికి | ఇక్కడ క్లిక్ చేయండి |
| ఆధార్ నెంబర్ ద్వారా పెన్షన్ వివరాలు | ఇక్కడ క్లిక్ చేయండి |
| అభయహస్తం దరఖాస్తు ఫామ్ | డౌన్లోడ్ చేయండి |
| తెలంగాణ మీసేవ అధికారిక వెబ్సైట్ | tgmf.in |
| అన్ని రకాల దరఖాస్తు ఫామ్లు | ఇక్కడ క్లిక్ చేయండి |
