ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) అద్భుతమైన అవకాశం కల్పించింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సీడ్యాక్ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 951 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రముఖ నగరాల కేంద్రాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30 లోగా ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని వివిధ సీడాక్ కేంద్రాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో ప్రధానంగా..
బెంగళూరు: 272 ఖాళీలు
హైదరాబాద్: 16 ఖాళీలు
ఇతర కేంద్రాలైన చెన్నై, తిరువనంతపురం, కోల్‌కతా, నోయిడా, మొహాలీ, గువాహటి తదితర నగరాల్లో మిగిలిన ఖాళీలు ఉన్నాయి.
అందుబాటులో ఉన్న పోస్టులు:
ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్ వంటి విభిన్న కేటగిరీల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యార్హతలు:
పోస్టులను బట్టి సంబంధిత విభాగాలలో కింది అర్హతలు కలిగి ఉండాలి.
బీఈ / బీటెక్ / ఎంసీఏ, ఐటీఐ / డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీతో పాటు CA / LLM / CS / CMA / MBA / PG లేదా Ph.D ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు పోస్టును బట్టి గరిష్టంగా 30 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇస్తారు.
ప్రాజెక్ట్ టెక్నీషియన్: రూ. 22,250 – రూ. 25,000
ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: రూ. 20,000 – రూ. 38,000
ప్రాజెక్ట్ ఆఫీసర్: రూ. 35,000 – రూ. 56,000
ప్రాజెక్ట్ మేనేజర్: రూ. 40,000 – రూ. 1,500,000 వరకు (పోస్టుల కేటగిరీని బట్టి జీతాల శ్రేణి మారుతుంది).
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: జూన్ 30వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cdac.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి.