[ad_1]
ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి 6 లక్షల మంది అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ 10th బోర్డు వారు శుభవార్త తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను ఈనెల 23వ తేదీ విడుదల చేయడానికి పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు మీడియాకు తెలపడం జరిగింది. ఇప్పటికీ పేపర్ మూల్యాంకనం మొత్తం పూర్తి చేసుకున్న అధికారులు, విద్యార్థులకు వచ్చినటువంటి మార్కులను డిజిటలైజేషన్ చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలను మార్చి 17వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోగలరు.
ఫలితాల విడుదల ఎప్పుడు?:
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు వారు ఇంటర్ ఫస్టియర్ అండ్ సెకండ్ ఇయర్ కి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు పదో తరగతి ఫలితాలు కూడా ఏప్రిల్ 23వ తేదీన అధికారికంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ద్వారా ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి పదవ తరగతి బోర్డు వారు సన్నాహాలు ప్రారంభించారు.
ఈసారి వాట్సాప్ లో ఫలితాలు :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు అన్ని ఫలితాలని వాట్సాప్ లోనే చూసుకునే విధంగా చాలా మంచి ఫెసిలిటీని తీసుకురావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు వాట్సాప్ లోనే ఫలితాన్ని డౌన్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు పదో తరగతి ఫలితాన్ని కూడా వాట్సాప్ లోనే చూసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాట్సాప్ లో పదవ తరగతి ఫలితాలు చూసుకోవాలి అంటే ఈ నెంబర్ +91 9552300009 ని కచ్చితంగా మీ వాట్సాప్ లో సేవ్ చేసుకోవాలి.
ఏపీలో ఇంటర్ అర్హతతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
వాట్సాప్ లో పదవ తరగతి ఫలితాలు ఎలా చూసుకోవాలి :
స్టెప్ 01: ముందుగా మీకు ఇచ్చినటువంటి వాట్సాప్ నంబర్ +919552300009 ఈ నెంబర్ కి టెన్త్ రిజల్ట్స్ అని చెప్పేసి మెసేజ్ చేయాలి.
స్టెప్ 2: అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని టెన్త్ రిజల్ట్స్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: విద్యార్థులకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ని ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి.
స్టెప్ 4: అప్పుడు పదో తరగతికి సంబంధించినటువంటి ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి
స్టెప్ 5: స్క్రీన్ మీద కనిపించిన టువంటి ఫలితాలు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
వాట్సాప్ లోనే కాకుండా ఇతర అధికారిక వెబ్సైట్లలో కూడా 10వ తరగతి ఫలితాలు చూసుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ వెబ్సైట్ కి సంబంధించినటువంటి వివరాలను ఈ క్రింద లిస్ట్ ద్వారా తెలుసుకోగలరు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి పదోతరగతి ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలు వివరాల కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించగలరు.
[ad_2]