ఇ-శ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రారంభమై 5 వసంతాలు.. Compensation & Benefits
దేశంలోనే ప్రథమ ఆధార్-ధృవీకరించబడిన జాతీయ డేటాబేస్ | ఇప్పటికే 31.89 కోట్ల మంది అసంఘటిత కార్మికులు రిజిస్ట్రేషన్
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇ-శ్రమ్ పోర్టల్ (e-Shram Portal) రిజిస్ట్రేషన్ ప్రారంభమై 5 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ పోర్టల్ లో ఇప్పటికే 31.89 కోట్ల మంది అసంఘటిత కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశం లోనే ప్రథమ ఆధార్-ధృవీకరించబడిన జాతీయ డేటాబేస్ https://www.eshram.gov.in/
💰 ఈ పోర్టల్ లో నమోదు ద్వారా లాభాలు 💰
ప్రమాదవశాత్తు మరణం మరియు శాశ్వత వైకల్యానికి రూ.2 లక్షలు
పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష చెల్లిస్తారు
PM Suraksha Bima Yojana (PMSBY) ద్వారా 1 సంవత్సరం ప్రమాద భీమా కవరేజ్
కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు దరఖాస్తులు చేసుకోవాలని కార్మిక శాఖ అధికారి బిఎఫ్ రాజు తెలిపారు.అన్ని జిల్లా, మండల పరిధిలోని కామన్ సర్వీస్ సెంటర్లు (CSC), మీ సేవ సెంటర్లలో కార్మికులు ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ కాపీలు, సెల్ నెంబర్ తో ఇస్తే ఉచితంగా సభ్యత్వం నమోదు చేస్తారన్నారు. ఈ పోర్టల్ లో పేరు నమోదు అయిన వెంటనే UAN కార్డు (e-Shram Card) మంజూరు అవుతుందన్నారు.
| పోర్టల్ పేరు | e-Shram Portal – National Database of Unorganized Workers |
| లబ్ధిదారులు | 31.89 కోట్ల మంది నమోదు (5 సంవత్సరాల్లో) |
| అధికారిక వెబ్సైట్ | https://www.eshram.gov.in/ |
| టోల్ ఫ్రీ నెంబర్ | 14434 |
| వయస్సు అర్హత | 16 / 18 నుండి 59 సంవత్సరాలు |
| రిజిస్ట్రేషన్ ఫీజు | ఉచితం (Free) |
| కార్డు | 12 అంకెల ప్రత్యేక e-Shram Card |
ఈ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవడానికి ఎవరు అర్హులు?
- భవన నిర్మాణ కార్మికులు
- వలస కార్మికులు
- వీధి విక్రేతలు / వీధి వ్యాపారులు
- గృహ కార్మికులు / పనిమనుషులు
- పాల కార్మికులు
- ట్రక్ డ్రైవర్లు
- మత్స్యకారులు
- వ్యవసాయ కార్మికులు / కూలీలు
- కన్స్ట్రక్షన్ వర్కర్లు, ఇతర అసంఘటిత కార్మికులు
కూలీలు, కార్మికుల కోసం ఇ-శ్రమ్ – పూర్తి వివరాలు
కన్స్ట్రక్షన్ వర్కర్లు, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, పనిమనుషులు, కార్మికుల, కూలీల వంటి అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇ-శ్రామ్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలోని 38 కోట్ల మంది కార్మికుల వివరాలను సేకరించి డాటాబేస్ తయారు చేశామని ప్రకటించారు.ఫలితంగా వీళ్ళు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను, వివిధ ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రాలు, ట్రేడ్ యూనియన్లు ఒక్కతాటిపైకి తెచ్చి కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.ప్రతి కార్మికుడికి ప్రత్యేకమైన 12 అంకెల నెంబరు గల ఇ-శ్రామ్ కార్డులు ఇస్తారు. రిజిస్ట్రేషన్ ఉచితంగానే చేస్తారు, కార్మికులకు దేశమంతటా గుర్తింపు ఉంటుంది.
రిజిస్ట్రేషన్ వల్ల లాభాలు – Compensation & Benefits
- ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) ద్వారా ప్రమాద భీమా:
- ప్రమాదవశాత్తు మరణం / శాశ్వత వైకల్యం – రూ.2 లక్షలు
- పాక్షిక వైకల్యం – రూ.1 లక్ష
- అసంఘటిత కార్మికులందరికీ ఒక సంవత్సరం పాటు ఉచిత భీమా కవరేజ్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నేరుగా అనుసంధానం
- వైపరీత్యాలు లేదా మహమ్మారి వచ్చినప్పుడు సహాయం అందించడానికి డేటాబేస్ ఉపయోగం
- దేశవ్యాప్తంగా గుర్తింపు కార్డు
ఇ-శ్రామ్ పోర్టల్ లో సులభంగా రిజిస్టర్ అవ్వండి ఇలా..
- ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్ లో సెర్చ్ బార్ లో e-Shram Portal అని టైప్ చేయండి
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.eshram.gov.in/ - హోం పేజీలో కనిపిస్తున్న Register on e-Shram పై క్లిక్ చేయండి
- ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP వెరిఫై చేయండి
- బ్యాంక్ ఖాతా వివరాలు, వృత్తి వివరాలు, అడ్రస్ నమోదు చేయండి
- Submit చేయగానే 12 అంకెల e-Shram Card డౌన్లోడ్ చేసుకోవచ్చు
- మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 14434 కు కాల్ చేయండి
కావలసిన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డ్
- బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్
- మొబైల్ నెంబర్ (ఆధార్ లింక్)
📍 Note: మరిన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు & కార్మిక సంక్షేమ అప్డేట్స్ కోసం
ను ప్రతిరోజూ సందర్శించండి..🙏
Tags: e-Shram Portal, eShram Card, Unorganized Workers, 31.89 Crore Registration, PMSBY Rs 2 Lakh, Compensation Benefits, Central Govt Schemes
