AP Police Jobs 2026 – ఏపీ రాష్ట్రంలో 1534 పోలీస్ పోస్టులకు ఈరోజు నుంచి అప్లికేషన్ ప్రారంభం – SI 378 + Constable 1156 – Apply 16.12.2026 వరకు
AP Police SI, Constable Notification 2026-27 Application Start: ఆంధ్రప్రదేశ్ లో 1534 పోలీస్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈరోజు 27 నవంబర్ 2026 సాయంత్రం నుండి దరఖాస్తు ప్రారంభం కానున్నది. అర్హులైన అభ్యర్థులు 16 డిసెంబర్ 2026 తేదీ సాయంత్రం 5 PM వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా 378 ఎస్సై ఉద్యోగాలు, 1156 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి.
👮 AP Police 🔥 – 1534 Posts – SI + Constable 🚀
పోస్టుల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SI, కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం SLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో SI 378 ఉద్యోగాలు, 1156 కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీ చేయనున్నారు.
SI: SI సివిల్స్ 253, AR 116, SPF SI 9 పోస్టులు ఉన్నాయి.
Constable: సివిల్ కానిస్టేబుల్ 542, AR 285, ఫైర్ మాన్ 158, జైల్ వార్డెన్స్ (మాన్) 150, వార్డెన్స్ ఉమెన్స్ (21) ఉద్యోగులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకి 27 నవంబర్ నుంచి 16 డిసెంబరు 2026 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హత & వయోపరిమితి
కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై ఉద్యోగుల కోసం ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి 18 సంవత్సరాలు నుంచి 32 సంవత్సరాలు మధ్యలో ఉండాలి, వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం & పరీక్ష తేదీలు
ఈ ఉద్యోగాలకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) & రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
కానిస్టేబుల్ Prelims Exam: 31.01.2027 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు.
ఎస్సై Exam: 28.02.2027 పేపర్-1 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు & పేపర్-2 మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 05:30 వరకు.
ఇతర పోస్టులు: ఎస్ఐ (పిటిఓ & కమ్యూనికేషన్), సైంటిఫిక్ అసిస్టెంట్స్ (ఎఫ్ఎస్ఎల్), పిసి (కమ్యూనికేషన్), పిసి (డ్రైవర్ & మెకానిక్) (పిటిఓ) మరియు డ్రైవర్ ఆపరేటర్ (ఎస్డిఆర్ఎఫ్ఎస్) పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తుల తేదీ త్వరలో జారీ చేయబడుతుంది.
ముఖ్యమైన సూచనలు
ఏవైనా సాంకేతిక లేదా సాధారణ సందేహాల నివృత్తి కోసం, అభ్యర్థులు APSLPRB అధికారిక వెబ్సైట్ (https://slprb.ap.gov.in) లో అందించిన హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించడమైనది. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను విజయవంతంగా సమర్పించిన తర్వాత, అభ్యర్థులు తుదిగా సమర్పించిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసి, ప్రింటవుట్ తీసుకుని, భవిష్యత్ సూచన కోసం దానిని భద్రపరచుకోవాలి.
Press Note: https://slprb.ap.gov.in/2026_PDFS/PressNote_dated_26112026.pdf

Notification: https://slprb.ap.gov.in/UI/recruitments
FAQs
1. మొత్తం పోస్టులు? Ans: 1534.
2. SI / Constable? Ans: SI 378 + Constable 1156.
3. అర్హత? Ans: SI – Degree, Constable – Inter.
4. వయసు? Ans: 18-32 Yrs.
5. చివరి తేదీ? Ans: 16.12.2026 @ 5 PM.
👮 AP Police 1534 SI Constable APSLPRB 2026 SI Civil AR SPF Fireman Jail Warder
