jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
AP NTR Bharosa Pension 2026 Eligibility Full Process Last Date Sep 16

AP NTR Bharosa Pension 2026 Eligibility Full Process Last Date Sep 16

September 7, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

ఏపీలో కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | NTR Bharosa Pension 2026 Eligibility, Full Process, Last Date

AP NTR Bharosa Pension 2026 Eligibility, Full Process, Last Date : ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నేటి నుంచి సచివాలయాల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.. ఈనెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కొత్త పెన్షన్ దరఖాస్తులు ఆన్లైన్ లో సిద్ధం ద్వారా ఆహ్వానిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, మత్స్యకారులు, చేనేతలు, డప్పు కళాకారులు, కల్లుగీత కార్మికులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్ జెండర్లు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు రాష్ట్రంలో అన్ని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ బాధ్యత సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ లేదా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి కి అప్పగించారు. అప్లికేషన్ గ్రామ/వార్డు సచివాలయంలో కూడా దొరుకుతుంది లేదా https://sspensions.ap.gov.in/SSP వెబ్సైట్ లో కూడా దొరుకుతుంది.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం eKYC డేటాతో బ్యాక్ ఎండ్ లో సిస్టం సరిపోల్చుతుంది. అన్నీ సరిగ్గా ఉంటే దరఖాస్తు తుది దశకు వెళుతుంది. 6 అంచెల తనిఖీ విధానంలో దరఖాస్తు వివరాలను పరిశీలిస్తారు. అనర్హులకు తిరస్కరణ పత్రం అందిస్తారు. అర్హులకు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయి తనిఖీ చేసి నిర్ధారిస్తారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ముఖ్యమైన తేదీలు :

No ప్రక్రియ తేదీ
1 కొత్త పెన్షన్ దరఖాస్తు స్వీకరణ & eKYC తనిఖీ Sep 7 – Sep 16
2 అర్హత తనిఖీలు, క్షేత్రస్థాయి పరిశీలన, వృత్తిపర తనిఖీలు Sep 17 – Sep 21
3 MPDO, Municipal Commissioner, District/State Scrutiny Sep 22 – Sep 24
4 Budget Proposal & Govt Approval Sep 25 – 26
5 కొత్త పెన్షన్ల విడుదల దశలవారీగా Oct 1 నుంచి

అవసరమైన డాక్యుమెంట్ వివరాలు :

  1. అన్ని కేటగిరీలకు : ఆధార్ కార్డు, బియ్యం కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
  2. వితంతు పెన్షన్ : భర్త మరణ ధ్రువీకరణ పత్రం + భర్త ఆధార్ నంబర్
  3. ఒంటరి మహిళ : విడాకులు అయితే కోర్టు విడాకుల పత్రం
  4. పెళ్లి కాని వారు : పెళ్లి కానట్లు తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం
  5. దివ్యాంగుల పెన్షన్ : కనీసం 40% పైగా వైకల్యం ఉన్న సదరం సర్టిఫికేట్
  6. చేనేత, మత్స్యకారులు, డప్పు కళాకారులు, కల్లుగీత : సంబంధిత శాఖ ధ్రువీకరణ పత్రం
  7. హిజ్రా/ట్రాన్స్ జెండర్ : జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 61.92 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు నెలకు రూ.2693.90 కోట్లు ఖర్చు అవుతోంది. గత 26 నెలల్లో రూ.73,507 కోట్లు ఖర్చు చేశారు. వృద్ధులు/వితంతువులు/ఒంటరి మహిళలకు రూ.4000, దివ్యాంగులకు రూ.6000 ఇస్తున్నారు.

అర్హులకు మంజూరు ఉత్తర్వులను సచివాలయంలోని సంక్షేమ విద్యా సహాయకుడు/వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి అందిస్తారు. కొత్త పెన్షన్ ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించి ఫైనల్ ముద్ర వేస్తారు.

📄 Application Form for New Pensions – Download

Tags: AP NTR Bharosa Pension 2026 Eligibility, NTR Bharosa New Pension Process Last Date Sep 16, AP Pension Documents Aadhaar Rice Card Income SADAREM, sspensions.ap.gov.in New Application Form PDF

Post Views: 33

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. 10వ తరగతితోనే అంగన్వాడీలో 70 ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎంపిక విధానం ఇదే.. »
  3. కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  4. AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • SpinoS Hiring Coimbatore | Pharmacist Clinical Research & Trainee Research Associate | Freshers
  • Urgent Hiring Chennai | AR Caller Physician Billing | 1+ Year | Up to ₹42K | Night Shift
  • Career for Research Scientist in Viral Research and Diagnostic Laboratory, AIIMS
  • Ipca Laboratories Walk-in Interview for API Production, QA and Injectable Manufacturing Jobs
  • IIIM Interview for Pharma, Chemistry, Biochemistry, Biotechnology, Microbiology candidates

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online