Anganwadi Jobs : 10వ తరగతితోనే అంగన్వాడీలో 70 ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎంపిక విధానం ఇదే..
Anganwadi Notification for filling the vacant posts of AWWs, AWHs in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం లో నంద్యాల జిల్లా పరిధి లో 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల లో ని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాలు నియమకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఉద్యోగులకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులై అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు 18.09.2026 సాయంత్రము 5.00 గంటల లోపల కార్యాలయములో అఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
అంగన్వాడి పోస్టులు మరియు ఖాళీ వివరాలు
1. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు : 03
2. అంగన్వాడీ ఆయాలు : 67
మొత్తం : 70 పోస్టులు
అంగన్వాడీ కార్యకర్త పోస్టునకు కావాల్సిన అర్హతలు:-
1. అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను.
2. 01.07.2026 నాటికి 21వ సం. ల వయస్సు నిండి 35 సం. ల వయస్సు లోపు వారై ఉండవలెను
3. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను
4. యస్. సి. యస్ టి జనవాస ప్రాంతాలలో అభ్యర్థినిల లో 21సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను
అంగన్వాడీ ఆయా పోస్టునకు కావాల్సిన అర్హతలు:-
1. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు ఎవరూ లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును.
2. అభ్యర్థినులు తేదీ 01.07.2026 నాటికి 21వ సం. ల వయస్సు నిండి 35 సం. ల వయస్సు లోపు వారై ఉండవలెను
3. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను
4. యస్. సి. యస్ టి జనావాస ప్రాంతాలలో అభ్యర్థినిల లో 21సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను
మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాలు జాబ్స్ కి జతపరచవలసిన ధృవ పత్రములు:-
1. పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము
2. కుల దృవీకరణ పత్రము
3. విద్యార్హత దృవీకరణ పత్రము – యస్.యస్.సి. మార్క్ లిస్ట్, టి.సి, మరియు యస్. యస్. సీ లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్ట్ మరియు టి. సి. జతపర్చవలెను
4. నివాస స్థల దృవీకరణ పత్రము
5. వితంతువు అయినచో భర్త మరణ దృవీకరణ పత్రము మరియు 18 సం. ల పిల్లలు ఉన్నచో, వారి యొక్క వయసు దృవీకరణ పత్రము.
6. వికలాంగులు అయినచో పి. హెచ్ సర్టిఫికేట్
7. ఆధార్ కార్డ్ మరియు 8. రేషన్ కార్డు
దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అటెస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఓ కార్యాలయమునకు తేదీ: 05.09.2026 ఉదయం 10.30 గం.ల నుండి తేదీ:18.09.2026 సాయంత్రము 5.00 గంటల లోపల కార్యాలయముల అన్ని పని దినములలో సమర్పించవలెను.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
Tags: Nandyal Anganwadi Jobs 2026, AP AWW AWH 70 Posts 10th Pass, Nandyal District ICDS No Exam Direct Jobs, Last Date 18 Sep 2026
