ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షల యొక్క ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఈరోజు అనగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మొత్తం 6.5 లక్షల మంది విద్యార్థులు 2026 పదవ తరగతి పరీక్షలు రాశారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు మూల్యాంకనం మరియు మార్కుల నమోదు ప్రక్రియ పూర్తి చేసిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఈరోజు ఫలితాలను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఏపీ పదో తరగతి బోర్డు వెబ్సైట్ నుండి, మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా మరియు ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఈరోజు ఏపీ 10వ తరగతి 2026 ఫలితాలను ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ తన యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫలితాలను ప్రకటిస్తారు. పరీక్ష రాసిన 6.5 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ ద్వారా పరీక్షల యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత విద్యార్థులు ఫలితాలను వెంటనే చెక్ చేసుకునేందుకు అధికారులు బోర్డు వెబ్సైట్ మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షలకు ఫలితాలను క్రింది సభ్యులు ద్వారా తెలుసుకోండి
- ముందుగా ఏపీ ఎస్ఎస్సి బోర్డు అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
- వెబ్సైట్ హోం పేజ్ లో ” AP SSC 2026 results download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతుంది
- విద్యార్థుల యొక్క మార్కులు చెక్ చేసుకోండి
- మార్క్స్ మెమో ప్రింట్ అవుట్ తీసుకోండి
పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత సబ్జెక్టులలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ నెలలో సప్లిమెంటరీ రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు సబ్జెక్టుల వారీగా ఫీజులను చెల్లించి ప్రిపేర్ అయ్యి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావలెను.