BIG UPDATE : కొత్త పెన్షన్లకు.. ఈనెల 15 వరకు చేయూత పెన్షన్ల గడువు పెంపు.. Cheyutha Pension Scheme 2026 Last Extended
Telangana Cheyutha Pension Scheme 2026 – Last Date Extended Official Update
Telangana Cheyutha Pension Scheme 2026 Last Extended: తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పెన్షన్ దరఖాస్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు గడువు పొడిగించింది. గతంలో ప్రకటించిన ప్రకారం నేటితో గడువు ముగిస్తుంది. అయితే చాలామందికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తితో ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపుగా 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు గడువు తేది సెప్టెంబర్ 15 వరకు పెంచారు. ఈ మేరకు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ No. 131/SERP/SP/New Section 2026 సోమవారం రాత్రి ఒక సర్కులర్ జారీ చేశారు. అభ్యర్థులు మరియు ఆయా జిల్లాల కలెక్టర్ సూచనలు మేరకు గడువు సెప్టెంబర్ 15 వరకు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎక్కడ అప్లై చేయాలి?
రాష్ట్రంలో చేయూత పెన్షన్ కోసం ఇప్పటికి అప్లై చేయని అభ్యర్థులు గ్రామాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం పంచాయతీ కార్యదర్శి, మండల్ పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్ (MPDO) వద్ద దరఖాస్తు చేసుకోవాలి. అలానే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న అభ్యర్థులు మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్లి అప్లై చేసుకోవాలి. మీ సేవ కేంద్రం ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.
కావలసిన డాక్యుమెంట్స్:
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- బ్యాంకు పాస్ బుక్
- సంబంధిత అర్హత సర్టిఫికెట్స్ (వితంతు / ఒంటరి మహిళ / దివ్యాంగుల / గీత / చేనేత కార్మికులు)
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారు తప్పకుండా మీ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఇందులో ప్రాధాన్యత ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు & దివ్యాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
Tags: Telangana Cheyutha Pension Scheme 2026, Cheyutha Pension Last Date Extended Sept 15, SERP Circular 131, Telangana New Pension Apply, Aasara Cheyutha Pension Documents
