నవోదయ 9వ, 11వ తరగతి ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల | JNVST 2027 Class 9th, 11th Admission Notification
Jawahar Navodaya Vidyalaya JNVST Class 9th 11th Free Admission 2027-28
Jawahar Navodaya Vidyalaya School 9th, 11th JNVST Admission Notification 2026: విద్యార్థులకు ఉచితంగా నవోదయ (JNVST) స్కూల్లో అవకాశం. జవహర్ నవోదయ విద్యాలయంలో CBSE ద్వారా 2027-28 విద్యా సంవత్సరంలో 9, 11 వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఉచిత CBSE విద్య, ఉచిత వసతి & భోజనం, ఉచిత పుస్తకాలు & దుస్తులు & అధునాతన క్రీడా సౌకర్యాలు నవోదయ విద్యాలయ సమితి (NVS) లో ఉంటుంది.
జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిదవ తరగతి, 11వ తరగతి లలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బ్రాహ్మనల్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు.
- దేశవ్యాప్తంగా సీట్లు: 1330 సీట్లు
- ఆంధ్రప్రదేశ్ లో: 38 సీట్లు
- తెలంగాణలో: 30 సీట్లు
- అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతికి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతికి
- చివరి తేదీ: ఈ నెల 30 (September 30, 2026)
Karimnagar ఉమ్మడి జిల్లాలలో: గంగాధర్, కరీంనగర్, హుజురాబాద్, పెద్దపల్లి, మహదేవాపూర్, మంథని, సిరిసిల్ల, జగిత్యాల, సుల్తానాబాద్, వేములవాడ, మల్యాల, మెట్ పల్లి తదితర ప్రాంతాల విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
ఆన్లైన్లో అప్లై చేయండి
8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి ప్రవేశం కోసం:
https://cbseitms.nic.in/2026/nvsix_9/registrationclassIX
10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి ప్రవేశం కోసం:
Tags: JNVST 2027 Notification, Navodaya 9th 11th Admission 2027-28, Jawahar Navodaya Vidyalaya Free Admission, NVS Class IX XI Lateral Entry, Navodaya Seats AP Telangana
