APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం | APSRTC Divyanga Shakti scheme
APSRTC Divyanga Shakti free rtc bus travel scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు దివ్యాంగ సంక్షేమ పథకం ద్వారా దివ్యాంగ శక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగిన అభ్యర్థులకు ఏపీఎస్సార్టీసీ ద్వారా పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, నగర సర్వీస్ తో పాటు అంతర్ జిల్లా బస్సులలో ఈ సదుపాయం వర్తిస్తుంది. ఈరోజు నుంచే అధికారికంగా అమలులోకి తీసుకురానున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉద్యోగం, విద్య, ఉపాధి, వైద్యం కోసం ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. ప్రయాణ ఖర్చులు వారికి ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒంటరిగా ప్రయాణించలేని వారికి తోడు వచ్చిన వారికి 50% రాయితీ లభిస్తుంది.
అర్హతలు :
- సదరం ధ్రువీకరణ పత్రంలో కనీసం 40% వైకల్యం (Disability) నమోదయి ఉండాలి
- వినికిడి లోపం, అంధత్వం, మానసిక వైకల్యం, లోకో మోటార్ వైకల్యం ఉన్న అభ్యర్థులు అర్హులు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసే దివ్యాంగ శక్తి స్టార్ బస్ పాస్ + UDID కార్డు ఉన్నవారే ఉచిత ప్రయాణానికి అర్హులు
- దివ్యాంగ స్టార్ బస్ పాస్ లో QR కోడ్, RFID చిప్ ఉండడంతో కండక్టర్ వద్ద ఉండే టికెట్ యంత్రం ద్వారా స్కాన్ చేసి జీరో పే టికెట్ జారీ చేస్తారు
దివ్యాంగ స్టార్ బస్ పాస్ కోసం కావలసిన పత్రాలు :
- సదరం సర్టిఫికెట్ లేదా UDID కార్డు జిరాక్స్
- నివాస ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
అర్హులైన అభ్యర్థులు వెంటనే సమీపంలో ఉన్న ఆర్టీసీ బస్సు డిపో కౌంటర్లు లేదా గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Tags: APSRTC Divyanga Shakti Free Bus 2026, AP Free Bus For Disabled 40 Percent, Divyanga Star Bus Pass QR Code, APSRTC Free Travel UDID Card
