AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు
AP School Holiday 2026 next week 3 days holidays : ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ నెలలో వచ్చే వారంలో వరుసగా మూడు రోజులు సెలవు రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ నెలలో రాబోయే వారంలో వరుసగా మూడు రోజులు లీవ్ రానున్నాయి. వినాయక చవితి పండుగ తో పాటు ముందు రెండు రోజులు లీవ్ రానున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబరు 12,13, 14 రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి కారణంగా వరుసగా మూడు రోజులు లాంగ్ లీవ్ సెలవు వచ్చే అవకాశం ఉన్నాయి.
| తేదీ | రోజు | కారణం |
|---|---|---|
| Sep 12 | రెండో శనివారం | సాధారణ సెలవు |
| Sep 13 | ఆదివారం | వీక్లీ హాలిడే |
| Sep 14 | సోమవారం | వినాయక చవితి |
సెప్టెంబర్ 12వ తేదీన రెండో శనివారం సాధారణ విద్యాలయాలకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 13వ తేదీన ఆదివారం కావడంతో యధావిధిగా పాఠశాల సెలవు అయితే ఉంటుంది. మరసటి రోజు సెప్టెంబర్ 14వ తేదీన సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు ఉంటుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో వరుసగా మూడు రోజులు సెలవు రానున్నాయి.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ 22వ తేదీన మంగళవారం నాడు Eid-e-Milad-un-Nabi సందర్భంగా ఆప్షనల్ హాలిడే. ముస్లిం మైనారిటీ సంస్థలు లేదా వర్గానికి చెందిన విద్యాలయాలలో ఆ రోజు సెలవు ఉండే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారం సెలవులు. అదనపు సెలవులు ఇచ్చే అధికారం ఆయా జిల్లా కలెక్టర్ లేదా జిల్లా విద్యాశాఖ అధికారికి ఉంటుంది కాబట్టి వాతావరణ విపత్తు కారణాలతో అదనపు సెలవులు వచ్చే అవకాశం ఉంది.
Tags: AP School Holiday September 2026, AP 3 Days Holiday Sep 12 13 14, Vinayaka Chavithi School Holiday AP, Second Saturday Sunday Holiday AP Schools
