[ad_1]
AP Medical College Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీ మరియు ప్రభుత్వ హాస్పిటల్ నందు భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 10 వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చేసిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో వివిధ టెక్నీషియన్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Medical College ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 07 ఫిబ్రవరి 2025 నుండి 22 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. 24 మార్చ్ 2025 వ తేది నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తిరుపతి లో ఉన్న ప్రభుత్వ AP Medical College మరియు ప్రభుత్వ ఆసుపత్రి వారు విడుదల చేశారు చిత్తూర్ జిల్లా వారు కూడా దరఖాస్తు చేయవచ్చు ఇందులో మొత్తం 66 టెక్నీషియన్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
పోస్టులు వారీగా దరఖాస్తు చేయుటకు 10 వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చేసిన వారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు OC అభ్యర్థులు 300/- ఫీజు చెల్లించాలి. మిగిలిన అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించి వారు ఎస్వీ మెడికల్ కాలేజీ, డెవలప్మెంట్ ఫండ్ పేరిట DD చెల్లించాలి పూర్తి వివరాల కొరకు నోటిఫికేషన్ PDF చూడండి.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అర్హులు. OC, BC, EWS,SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలు మీకు లభిస్తే పోస్టులు వారీగా జీతం 15,000/- నుండి 32,570/- వరకు రావడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్సులు ఉండవు ఇవి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ జాబ్స్.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించరు కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు ఫారం SV మెడికల్ కాలేజీ, ప్రిన్సిపల్, తిరుపతి వారికి సమర్పించండి.
ఇటువంటి AP Medical College ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
[ad_2]