Ten years in jail if you cross the line
లోన్ యాప్ల్లో గానీ అప్పులు తీసుకున్నారా..? కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొస్తుంది వివరాలు.
అడ్డగోలుగా అప్పులిస్తే పదేళ్ల జైలు
యాప్‌ల ద్వారా అప్పులిచ్చినా శిక్ష, పెనాల్టీ తప్పవు.
లైసెన్స్ లేకుండా, అడ్డగోలుగా అప్పులిచ్చే వారిని, సంస్థలను శిక్షించేందుకు ప్రభుత్వం కొత్త బిల్లును ప్రపోజ్ చేసింది.
పెనాల్టీలతో పాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. ఆర్‌బీఐ లేదా ఇతర రెగ్యులేటరీ సంస్థల అనుమతులు లేకుండా అప్పులిస్తున్న సంస్థలను, ఇండివిడ్యువల్స్‌ను కంట్రోల్ చేసేందుకు, వినియోగదారులను రక్షించేందుకు ఆర్‌బీఐ వర్కింగ్ గ్రూప్ 2021లో డిజిటల్ లెండింగ్‌పై రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది.
లైసెన్స్‌లు లేకుండా అప్పులివ్వడాన్ని బ్యాన్ చేసేందుకు చట్టం తీసుకురావాలని రికమండ్ చేసింది. బంధువులకు అప్పులివ్వడాన్ని మినహాయించారు. చట్టాన్ని ఉల్లంఘించి ఆన్‌లైన్ లేదా ఇతర మార్గాల్లో అప్పులిస్తున్న వారికి కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ నెంబర్ ఏడేళ్ల వరకు పెరగొచ్చు. దీంతో పాటు రూ.2 లక్షల నుంచి రూ. కోటి వరకు ఫైన్ కూడా పడుతుంది. బారోవర్లను వేధించినా, చట్టవిరుద్ధంగా లోన్లను రికవరీ చేసినా కనీసం మూడేళ్లు, గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. బ్యానింగ్ ఆఫ్ అన్‌రెగ్యులేటెడ్ లెండింగ్స్ బిల్లుపై వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు ప్రజలు ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు.
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |